చర్చలు ఉన్నట్టా, లేనట్టా?... పాకిస్థాన్ లో మళ్లీ ప్రత్యక్షమైన ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ
- అమెరికాతో చర్చలు రద్దయిన నేపథ్యంలో ఇరాన్ కీలక దౌత్య ప్రయత్నాలు
- కొద్ది గంటల వ్యవధిలోనే రెండోసారి పాకిస్థాన్‌కు ఇరాన్ విదేశాంగ మంత్రి
- ఇరాన్ నాయకత్వంలో గందరగోళం ఉందంటూ చర్చలను రద్దు చేసిన ట్రంప్
- ప్రాంతీయ శాంతి కోసం పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించిన ఇరాన్
- పాకిస్థాన్, ఒమన్ పర్యటనల తర్వాత రష్యాకు వెళ్లనున్న ఇరాన్ మంత్రి
అమెరికా, ఇరాన్ మధ్య జరగాల్సిన శాంతి చర్చలు ఆగిపోయిన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చీ కొద్ది గంటల వ్యవధిలోనే రెండోసారి పాకిస్థాన్‌కు చేరుకోవడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అమెరికాతో చర్చల విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్‌లో ఆయన పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
నిన్ననే పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌తో సమావేశమై వెళ్లిన అరగ్చీ, ఆ తర్వాత ఒమన్‌కు వెళ్లారు. అక్కడ సుల్తాన్ హైతామ్ బిన్ తారిఖ్ అల్-సైద్‌తో సమావేశమై హోర్ముజ్ జలసంధి భద్రత, ఇరాన్‌పై యుద్ధాన్ని ముగించే అంశాలపై చర్చించారు. ఒమన్ పర్యటన ముగించుకున్న వెంటనే ఆయన మళ్లీ పాకిస్థాన్‌లోని రావల్పిండి నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. ఈ ఆకస్మిక పర్యటనలో భాగంగా ఆయన మరోసారి పాక్ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఇస్లామాబాద్‌లో భేటీల అనంతరం ఆయన మాస్కోకు బయలుదేరి వెళ్లనున్నట్లు సమాచారం.
మరోవైపు, ఇరాన్‌తో చర్చల కోసం తమ ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్‌ల ఇస్లామాబాద్ పర్యటనను రద్దు చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. "ప్రయాణాలతో చాలా సమయం వృథా అవుతోంది. పైగా ఇరాన్ నాయకత్వంలో తీవ్రమైన అంతర్గత పోరు, గందరగోళం నెలకొంది. అక్కడ బాధ్యత ఎవరిదో వారికే తెలియదు. మా చేతిలో అన్ని కార్డులు ఉన్నాయి, వారి దగ్గర ఏమీ లేవు. వారికే మాట్లాడాలని ఉంటే, ఫోన్ చేస్తే చాలు" అని ట్రంప్ ఘాటుగా పేర్కొన్నారు.
ఈ పరిణామాలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అరగ్చీ 'ఎక్స్' వేదికగా స్పందించారు. తన పాకిస్థాన్ పర్యటన ఫలప్రదంగా సాగిందని, ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు పాకిస్థాన్ చేస్తున్న సోదరపూర్వక ప్రయత్నాలను తాము ఎంతో గౌరవిస్తున్నామని తెలిపారు. ఇరాన్‌పై యుద్ధానికి శాశ్వతంగా ముగింపు పలికేందుకు తాము ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ప్రతిపాదించామని, అయితే దౌత్యపరంగా అమెరికా ఎంతవరకు చిత్తశుద్ధితో ఉందో వేచి చూడాలని ఆయన వ్యాఖ్యానించారు.